ఆలయంలో నెలసరి వస్తే ఏం చేయాలి?
Spiritual: మన హిందూ సంప్రదాయంలో నెలసరి వస్తే ఐదు రోజుల వరకు ఆలయానికి వెళ్లరు. కానీ కొన్ని సార్లు అనుకోకుండా ఆలయానికి వెళ్లిన సమయంలో నెలసరి వచ్చేస్తుంటుంది. ఆ సమయంలో ఒకవేళ వారు చూసుకున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటప్పుడు ఆడవాళ్లు ఏం చేయాలో చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు.
ఆడవారు ఆలయానికి వెళ్లినప్పుడు వారికి నెలసరి వస్తే.. అనుకోకుండా జరిగింది కదా అని దర్శనానికి వెళ్తుంటారని.. అది చాలా పాపం అని అన్నారు. ఆ సమయంలో వాళ్లు ఆలయం నుంచి బయటికి వెళ్లిపోవడం ఉత్తమం అని అన్నారు. తిరుమల దర్శన సమయంలో నెలసరి వస్తే అక్కడి సేవకులకు చెప్తే వారు లైన్ నుంచి బయటికి పంపిస్తారని.. అలా కాకుండా శ్రీవారిని దర్శించుకుంటే మహా పాపం అని వెల్లడించారు.