Aries: మేష రాశి వారు ఈ పనులు అస్సలు చేయకూడదు
Aries: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారు తెలీక కూడా ఈ పనులు అస్సలు చేయకూడదట. దీని వల్ల వారి జీవితంలో డబ్బు సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు.
*ఎవ్వరి పట్ల ద్వేషం కలిగి ఉండకూడదు. పగ తీర్చుకోవాలని అనుకుంటే అది మీకే నష్టం కలిగిస్తుంది. మిమ్మల్ని ఎవరైనా బాధపెడితే వారి పాపాన వారే పోతారు అనుకుని వదిలేయడం మంచిది.
*మీకు ఏదన్నా నష్టం వస్తోందని సంకేతాలు వస్తుంటాయి. అది ఏ విషయమైనా కావచ్చు. వాటిని సమయస్ఫూర్తితో గ్రహించి వెంటనే చర్యలు తీసుకోకపోతే చాలా నష్టపోతారు.
*పైకి అంతా మంచిగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ మీ అంతరాత్మ మాత్రం ఎందుకో వద్దు అని చెప్తుంటుంది. దానినే గట్ ఫీలింగ్ అంటారు. మేష రాశి వారు ఎక్కువగా గట్ ఫీలింగ్‌ని పట్టించుకోకుండా చూసింది వినింది నమ్మేస్తుంటారు. ఇలా అస్సలు ఉండకూడదు.
*మేష రాశి వారు ముందు వెనక ఆలోచించకుండా వాగ్దానాలు చేసేస్తుంటారు. ఆ తర్వాత అవి నెరవేర్చలేక ఒత్తిడికి గురవుతుంటారు. ఏదన్న మాట అనేముందు కానీ ఇచ్చే ముందు కానీ ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి.
*మేష రాశి వారు ముందు వెనక ఆలోచించకుండా తొందరపడి నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత దాని వల్ల కలిగిన పరిణామాల వల్ల కూర్చుని బాధపడుతుంటారు. మేష రాశి వారు ఈ లక్షణాన్ని వదిలించుకోవాలి.