Malla Reddy: నా భూమినే కబ్జా చేస్తార్రా.. రెచ్చిపోయిన మల్లారెడ్డి
Malla Reddy: భారత రాష్ట్ర సమితి నేత మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నా భూమినే కబ్జా చేస్తార్రా అంటూ మల్లారెడ్డి రచ్చ చేసారు. 15 ఏళ్ల కింద కొన్న భూమిని ఎలా కబ్జా చేస్తారంటూ మల్లారెడ్డి మీడియా ముందు రెచ్చిపోయారు. తన స్థలంలో బ్యారికేడ్లు వేస్తున్నారని తెలీయడంతో వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకుని బ్యారికేడ్లను తొలగించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దౌర్జన్యం పెరిగిపోయిందని ఆయన మండిపడ్డారు. తన వద్ద ల్యాండ్‌కి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని.. కావాలంటే సర్వేలు చేయించుకోవాలని డిమాండ్ చేసారు.