Poonam Pandey: షాకింగ్.. పూన‌మ్ బాత్రూమ్ వీడియో షేర్ చేసిన మాజీ ప్రియుడు

big shock to poonam pandey as her ex shares bathroom video

Poonam Pandey: అస‌భ్య‌క‌ర‌మైన దుస్తులు, వీడియోలు చేస్తూ అడ‌ల్ట్ స్టార్‌గా పాపులర్ అయిన పూన‌మ్ పాండే మ‌ళ్లీ వైర‌ల్ అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం స‌ర్వైక‌ల్ క్యాన్స‌ర్‌తో చ‌నిపోయానంటూ ప్ర‌జ‌లను న‌మ్మించి ఫూల్స్ చేసిన పూన‌మ్‌కు ఇప్పుడు ఆమె మాజీ ప్రియుడు షాకిచ్చాడు. పూన‌మ్ పాండే బాత్రూమ్ వీడియోను లీక్ చేసాడు. పూన‌మ్ బాత్రూమ్‌లో స్నానం చేస్తూ డ్యాన్స్ చేస్తున్న వీడియో యూట్యూబ్‌లో లీక్ అయ్యింది. చాలా మంది పూన‌మే కావాల‌ని ప‌బ్లిక్ స్టంట్ కోసమ‌ని త‌న వీడియోను తానే లీక్ చేసింద‌ని అనుకున్నారు. అయితే అది తాను లీక్ చేయ‌లేద‌ని.. త‌న మాజీ ప్రియుడు ఇంత నీచానికి దిగ‌జారాడని తెలిపింది. కాసేప‌టికే ఆ వీడియోను యూట్యూబ్ తొల‌గించేసింది.

“” ఆరోజు జరిగింది నేను ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేను. నాకు నా మాజీ ప్రియుడికి గొడ‌వైంది. న‌న్ను కొట్టాడు. ట్రిమ్మ‌ర్‌తో నా జుట్టు క‌త్తిరించాల‌ని చూసాడు. నేను నా ఫోన్ మ‌ర్చిపోయి పారిపోయాను. మా నాన్న వ‌ద్ద‌కు వెళ్లి జ‌రిగింది చెప్పాను. అప్పుడు మా నాన్న నా ప్రియుడిని హెచ్చ‌రించాడు. ఇంటికి రాక‌పోతే వీడియోలు లీక్ చేస్తాన‌ని బెదిరించాడు. ఏం చేసినా నేను రాను అని చెప్పా. చివ‌రికి ఇలా నా వీడియోలు లీక్ చేసి నా ప‌రువు తీసాడు. వాడు రాక్ష‌సుడని తెలుసు కానీ ఇంత నీచానికి దిగ‌జార‌తాడ‌ని అనుకోలేదు “” అని పూన‌మ్ వెల్ల‌డించింది.