ఫ్రెండ్స్‌తో యువ‌కుడి అస‌హ‌జ శృంగారం.. అడ్డొచ్చినందుకు తండ్రి హ‌త్య‌

UP man kills father as he objects homosexuality

Viral News: స్వ‌లింగ సంప‌ర్కుడైన ఓ యువ‌కుడు త‌న స్నేహితుల‌తో అస‌హ‌జ శృంగారం చేస్తున్నాడ‌ని తెలిసి అత‌ని తండ్రి మంద‌లించాడు. దాంతో కోపోద్రిక్తుడైన ఆ యువ‌కుడు క‌న్న తండ్రి అని కూడా చూడ‌కుండా దారుణంగా చంపేసాడు. ఇందుకు అత‌ని స్నేహితులు కూడా స‌హ‌క‌రించ‌డం షాకింగ్ విష‌యం.  ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. మ‌థుర‌కు చెందిన ఓ యువ‌కుడు స్వలింగ సంప్క‌రుడు. దాంతో త‌న స్నేహితుల‌తో అస‌హజ శృంగారంలో పాల్గొంటూ లైంగిక వాంఛ‌లు తీర్చుకుంటున్నాడు.

ఈ విష‌యం అత‌ని తండ్రికి తెలియ‌గా మంద‌లించాడు. అయినా ఆ వ్య‌క్తి విన‌లేదు. త‌న స్నేహితుల‌ను ఇంటికి పిలిపించుకుని అస‌భ్య‌క‌ర‌మైన ప‌నులు చేస్తుండ‌డంతో అత‌ని తండ్రి మండిప‌డ్డాడు. ఇద్ద‌రి మ‌ధ్య మాటా మాటా పెర‌గ‌డంతో ఆ యువ‌కుడు తండ్రి చేతులు కట్టేసి క‌త్తితో పొడిచాడు. ఆ త‌ర్వాత స్నేహితుల సాయంతో తండ్రి శ‌వాన్ని ఓ పెట్టెలో పెట్టి రోడ్డు మీద‌కు తీసుకొచ్చి నిప్పు పెట్టారు. పెట్టె నుంచి వాస‌న వ‌స్తుండ‌డంతో స్థానికులు పోలీసుల‌కు సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల‌కు జ‌రిగిన విష‌యం తెలిసింది. దాంతో యువ‌కుడితో పాటు అత‌నికి సాయం చేసిన స్నేహితుల‌ను అదుపులోకి తీసుకున్నారు.