మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం.. షానా ఏండ్లు గుర్తుంటాది..!

party workers creates ruckus in macherla constituency

Macherla: ఎన్నిక‌లు వ‌చ్చాయంటే అక్క‌డ ఏదో ఒక గొడ‌వ జ‌రిగి తీరాల్సిందే. చిన్న గొడ‌వా పెద్ద గొడ‌వా అనేది సంబంధం లేదు. గొడవ జ‌రిగిందా లేదా అనేదే ముఖ్యం. అదే మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం. ఈరోజు పోలింగ్ నేప‌థ్యంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన గొడ‌వ‌లు అన్నీ ఇన్నీ కాదు. ఒక పార్టీ వారు మ‌రో పార్టీ వారి వాహ‌నాలు త‌గ‌ల‌బెట్టేసారు. ఈవీఎంలు ధ్వంసం చేసేసారు. క‌ర్ర‌ల‌తో కొట్టుకున్నారు. క‌త్తుల‌తో దాడులు చేసుకున్నారు. ఇవ‌న్నీ ఈరోజు మాత్ర‌మే జ‌రిగిన గొడ‌వ‌లు. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఈరోజు మాచ‌ర్ల‌లో జరిగిన ఎలక్షన్ గురించి ఇంకో 10-15 ఏళ్ళు మాట్లాడుకుంటారనే చెప్పాలి. అందుకేనేమో మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం అనే సినిమా తీసారు.