AP Elections: ప్ర‌ముఖుల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంత శాతం ఓట్లు పోలయ్యాయంటే..?

AP Elections: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంట‌ల‌కు పోలింగ్ ప్ర‌క్రియ ముగిసింది. కొన్ని కార‌ణాల వ‌ల్ల పోలింగ్ ఆల‌స్యం అవ‌డంతో.. లైన్‌లో నిల‌బ‌డిన వారి చేత ఓట్లు వేయించాకే పోల్ బూత్ అధికారులు వారిని వెన‌క్కి పంపిస్తున్నారు. అయితే.. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన ఆరు నియోజ‌క‌వ‌ర్గాలు కుప్పం, పులివెందుల‌, మంగ‌ళ‌గిరి, పిఠాపురం, క‌డ‌ప‌, హిందూపూర్. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంత శాతం ఓట్లు న‌మోద‌య్యాయో చూద్దాం.

కుప్పం (చంద్ర‌బాబు నాయుడు) : 75.78%
పులివెందుల (జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి) : 75.8%
పిఠాపురం (ప‌వ‌న్ క‌ళ్యాణ్‌) : 71.58%
మంగ‌ళగిరి (నారా లోకేష్‌) : 68.2%
నంద‌మూరి బాల‌కృష్ణ (హిందూపూర్) : 70.12%
వైఎస్ ష‌ర్మిళ (క‌డ‌ప ఎంపీ సీటు) : 72.85%

ఈరోజు సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యానికి యావ‌త్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పోలింగ్ శాతం 67.99 శాతంగా ఉంది. 2019 ఎన్నికల్లో 79.08 శాతం నమోదైంది.