T20ల నుంచి రోహిత్ రిటైర్మెంట్.. ఒత్తిడిలో పాండ్య ఎంపిక‌

rohit sharma to retire from t20I

Rohit Sharma: ఇంకొన్ని రోజుల్లో జ‌ర‌గ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ T20Iల నుంచి నిష్క్ర‌మించ‌నున్నాడ‌ట‌. అందుకే త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న టీ20 వ‌రల్డ్ క‌ప్‌కు హార్దిక్ పాండ్య‌ను వైస్ కెప్టెన్‌గా ఒత్తిడిపై నియ‌మించాల్సి వ‌చ్చిందని క్రికెట్ వ‌ర్గాలు అంటున్నాయి.  ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా నియ‌మించిన త‌ర్వాత నుంచి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ కానీ ఆట‌తీరు కానీ ఏమాత్రం బాలేవు. అస‌లు ఫాంలోనే లేని హార్దిక్ పాండ్య‌ను టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయ‌డానికి కార‌ణం.. రోహిత్ టీ20ల నుంచి రిటైర్ అయ్యాక అత‌ని స్థానాన్ని పాండ్య‌తోనే భ‌ర్తీ చేయాల్సి ఉంటుంద‌ని BCCI నిర్ణ‌యించింది.