చంద్ర‌బాబు నాయుడు సీఎం అవ్వాల‌ని నాలుక కోసుకున్న అభిమాని

Chandrababu Naidu fan chops off his tongue in support of him

Chandrababu Naidu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో తన అభిమాన నేత చంద్రబాబు నాయుడు ముఖ్య‌మంత్రి కావాలంటూ ఓ అభిమాని నాలుక కోసుకున్నాడు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలో నివ‌సిస్తున్న చెవల మహేశ్.. ఏపీకి చంద్రబాబు సీఎం కావాలని తన నాలుక కోసుకుని మొక్కు తీర్చుకున్నానని అతను ఓ లెటర్ రాశారు. గతంలోనూ రెండు సార్లు తాను ఇలాగే నాలుక కోసుకున్నట్లు లెటర్‌లో రాసాడు. చెవ‌ల మ‌హేష్ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన‌వాడిగా పోలీసుల గుర్తించారు. అత‌న్ని వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.