Allu Arjun: నా అనేవారు ఏ పార్టీలో ఉన్నా స‌పోర్ట్ చేస్తా

allu arjun reacts on supporting YSRCP mla in nandyal

Allu Arjun: ఇటీవ‌ల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల‌కు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్య‌ర్ధి శిల్పా ర‌విచంద్ర కిశోర్ రెడ్డి త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌డం పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. మామ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీకి స‌పోర్ట్ చేయ‌కుండా.. ప్రత్య‌ర్ధి పార్టీకి చెందిన నేత‌కు స‌పోర్ట్ చేయ‌డం ఏంట‌ని చాలా మంది విరుచుకుప‌డ్డారు.

దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ… “” నా అన్నవారు ఏ పార్టీలో ఉన్నా స‌పోర్ట్ చేస్తా. మామ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కావ‌చ్చు.. ర‌విచంద్ర కిశోర్ రెడ్డి కావ‌చ్చు, మా మామ‌గారు కావ‌చ్చు ఇంకెవ‌రైనా కావ‌చ్చు. నేను పార్టీల‌కు అతీతం. అన్ని పార్టీలో నా వాళ్లు ఉంటే అంద‌రికీ స‌పోర్ట్ చేస్తాను. ర‌విచంద్ర కిశోర్ రెడ్డి నాకు మంచి మిత్రుడు. 2019 ఎన్నిక‌ల‌కు ముందే నేను ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తే త‌ప్ప‌కుండా ప్ర‌చారం చేస్తాన‌ని మాటిచ్చాను. కానీ 2019 ఎన్నిక‌ల్లో నాకు కుద‌ర‌లేదు. అందుకే ఈసారైనా ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవాల‌ని ఆయ‌నకు మ‌ద్ద‌తు తెలిపేందుకు నా భార్య‌తో క‌లిసి నంద్యాల వెళ్లాను “” అని తెలిపారు.