Jagan: కార్లు మార్చిన‌ట్లు భార్య‌ల‌ను మార్చే ప‌వ‌న్‌ని మ‌హిళ‌లు ఎలా న‌మ్మాలి?

jagan again criticises pawan kalyan on his marriages

Jagan:  ప్ర‌తి ఐదేళ్లకోసారి కార్లు మార్చిన‌ట్లు భార్య‌ల‌ను మార్చే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌హిళ‌లు ఎలా న‌మ్మాలి అని ప్ర‌శ్నించారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. పిఠాపురంలో వంగా గీత కోసం ప్ర‌చారంలో పాల్గొన్నారు జగ‌న్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. భార్య‌ల‌ను మార్చే ప‌వ‌న్ గెలిస్తే రేపు ఏ మ‌హిళ‌కైనా ఏద‌న్నా అవ‌స‌రం వ‌చ్చి ఆయ‌న వ‌ద్ద‌కు ఎలా వెళ్తుంది? క్షేమంగా వ‌స్తుంద‌ని ఎలా నమ్మాలి? అని మ‌రోసారి అస‌భ్య‌క‌రంగా మాట్లాడారు.

ప‌వ‌న్ భార్య‌ల‌ను మార్చ‌డం పొర‌పాటు కాద‌ని.. అల‌వాట‌ని అన్నారు. సాధ్యం కాని మేనిఫెస్టోను ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు నాయుడుతో ప‌వ‌న్ చేతులు క‌లిపాడ‌ని.. రేపు పొర‌పాటున పిఠాపురంలో గెలిస్తే ప‌వ‌న్ హైద‌రాబాద్‌కు వెళ్లిపోయి ప్ర‌శాంతంగా జీవితాన్ని గ‌డుపుతాడ‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ ఐదేళ్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన మంచిని.. కూట‌మికి ఓటేసి పోగొట్టుకోవ‌ద్ద‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. వాలంటీర్లు ఇంటికి వ‌చ్చి పెన్ష‌న్లు ఇంటికే రావాలంటే.. ప‌థ‌కాలు ఇంటి వ‌ద్ద‌కే రావాల‌న్నా కూడా మ‌ళ్లీ జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మే అధికారంలోకి రావాల‌ని పిలుపునిచ్చారు.