Ram Gopal Varma: ష‌ర్మిళ‌కు ఆస్కార్ ఇవ్వాలి

Ram Gopal Varma says ys sharmila deserves oscar

Ram Gopal Varma: APCC చీఫ్ వైఎస్ ష‌ర్మిళ‌కు (YS Sharmila) ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ సెటైర్ వేసారు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఓ ఇంట‌ర్వ్యూలో త‌న సోద‌రుడు జ‌గ‌న్ మోహన్ రెడ్డి త‌నపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారంటూ నిన్న ష‌ర్మిళ ప్రెస్ మీట్‌లో కంట‌త‌డి పెట్టుకున్నారు. ఆ వీడియోని వ‌ర్మ ట్విట‌ర్‌లో షేర్ చేస్తూ అతి పెద్ద ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అంటూ కామెంట్ చేసారు.

రామ్ గోపాల్ వ‌ర్మ ముందు నుంచీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఆయ‌న‌కు జ‌గ‌న్ ఎన్నిక‌ల స‌మ‌యం కాబ‌ట్టి భారీగా డ‌బ్బు ఇచ్చి త‌న‌కు క‌లిసొచ్చేలా సినిమాలు తీయాల‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. అందుకే వ‌ర్మ స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స‌పోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేయ‌డం.. ఆ పార్టీకి వ్య‌తిరేకంగా ఎవ‌రైనా మాట్లాడితే వారిపై నెగిటివ్ కామెంట్స్ చేయ‌డం వంటివి చేస్తున్నారు.