Allu Arjun: మామకి మద్దతు.. YSRCP నేత కోసం ప్రచారం
Allu Arjun: ఓ పక్క మామ పవన్ కళ్యాణ్‌కి (Pawan Kalyan) మద్దతు ఇస్తూనే మరోపక్క వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రవిచంద్ర కిశోర్ రెడ్డి తరఫున ప్రచారం చేయనున్నారు. ఎన్నికల్లో నంద్యాల నుంచి బరిలోకి దిగిన రవిచంద్ర కిశోర్ రెడ్డికి బన్నీ మంచి స్నేహితుడు. అతని కోసం తనతో పాటు భార్య అల్లు స్నేహా రెడ్డిని కూడా ప్రచారం కోసం నంద్యాల వెళ్లారు. పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయని బన్నీ.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోసం నంద్యాల వెళ్లి మరీ ప్రచారం చేయడంపై కూటమి నేతల్లో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.