కేర‌ళ ఆల‌యాల్లో గ‌న్నేరు పువ్వుల‌ను ఎందుకు నిషేధించారు?

why kerala temples banned the use of oleander flower

Kerala: కేర‌ళ‌లోని అన్ని ఆల‌యాల్లో గ‌న్నేరు పువ్వుల‌ను వాడకాన్ని నిషేధించిన‌ట్లు ట్రావ‌న్‌కోర్ దేవ‌స్థాన బోర్డు, మ‌ల‌బార్ దేవ‌స్థాన బోర్డులు ప్ర‌క‌టించాయి.  కేర‌ళ రాష్ట్రంలోని దాదాపు అన్ని ఆల‌యాలను ఈ రెండు బోర్డులే చూసుకుంటున్నాయి. ఆల‌యాల్లోని విగ్ర‌హాల‌కు కానీ భ‌క్తుల‌కు కానీ గ‌న్నేరు పువ్వులు ఇవ్వ‌కూడ‌ద‌ని దేవ‌స్థాన బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేసారు. ఇందుకు కార‌ణం గ‌న్నేరు పువ్వులు విష‌పూరితం కావ‌డ‌మే.

రెండు రోజుల క్రితం కేర‌ళ‌కు చెందిన ఓ 26 ఏళ్ల యువ‌తి ఫోన్ మాట్లాడుతూ గ‌న్నేరు పువ్వును కోసి పొర‌పాటున నోట్లో పెట్టేసుకుంది. ఆ త‌ర్వాత రెండు గంట‌ల‌కే ఆమె స్పృహ‌త‌ప్పి ప‌డిపోయింది. వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించ‌గా.. గ‌న్నేరు పువ్వులోని ర‌సం విషపూరితం అని అది క‌డుపులోకి వెళ్ల‌డం వ‌ల్ల ఒళ్లంతా విష‌పూరిత‌మై చ‌నిపోయింద‌ని వైద్యులు చెప్పారు. అప్ప‌టి నుంచి గ‌న్నేరు పువ్వుల‌ను పెంచ‌డం నుంచి వాటిని ఆల‌యాల్లో వాడ‌టం వ‌ర‌కు అన్నీ నిషేధించ‌నున్న‌ట్లు ఆల‌య బోర్డు అధికారులు నిర్ణ‌యించారు.