‘ఆ పాటతో నా కల నెరవేరింది’
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’మూవీ నుంచి ఇటీవల విడుదలైన ‘ఏంటమ్మా’సాంగ్ రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోన్న సంగతి తెలిసిందే. మొదటిసారి సల్మాన్ నేరుగా హిందీతోపాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుంది. విడుదలకు సిద్ధమైన ఈ మూవీ నుంచి విడుదలైన బతుకమ్మ పాట తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘ఏంటమ్మా’ అనే మాస్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సల్మాన్, వెంకీతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కనిపించడం విశేషం. ఈ ముగ్గురూ కలిసి లుంగీ గెటప్స్‌లో వేసిన మాస్ స్టెప్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. తాజాగా మేకర్స్ విడుదల చేసిన మేకింగ్ వీడియోలో సల్మాన్‌తో కలిసి డాన్స్ చేయడంపై పలు విషయాలు పంచుకున్నారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్.
ఇక ఈ పాట విడుదలైన రెండు రోజుల్లోనే 43 మిలియన్‌కు పైగా వ్యూస్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించింది. ఈ సందర్భంగా పాట క్రేజ్ మరింత పెంచేందుకు మేకర్స్ ఓ వీడియో విడుదల చేశారు. ఈ మేకింగ్ వీడియోలో రామ్ చరణ్ ఈ పాటలో కనిపించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సినిమాలోని ‘ఏంటమ్మా’ సాంగ్‌లో గెస్ట్ అప్పియరెన్స్ చేయడం అద్భుతంగా అనిపించింది. మొత్తానికి ఈ ఎక్స్‌పీరియన్స్ ద్వారా నా చిన్నప్పటి కల నిజమైంది. సిల్వర్ స్క్రీన్‌పై చూసినపుడు ప్రేక్షకులు ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ పాట చేస్తున్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు చెర్రీ.
పాయల్ దేవ్ కంపోజ్ చేసిన ‘ఏంటమ్మా’ సాంగ్‌కు షబ్బీర్ అహ్మద్ సాహిత్యం అందించగా.. విశాల్ దద్దానీ, పాయల్ దేవ్, రఫ్తార్ పాడారు. టాలీవుడ్‌కి చెందని జానీ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీ అందించడం ప్రత్యేకం. ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ చిత్రం ఈద్ సందర్భంగా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చెర్రీ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. ‘గేమ్ చేంజర్’గా భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అడ్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్, సునిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది.