Birthday Special: బన్నీ అందుకున్న అవార్డులెన్నో తెలుసా!
కెరీర్ ఆరంభం నుంచీ ఒక్కో సినిమాకు భిన్నమైన పాత్రలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఐకాన్ స్టార్‌గా ఎదిగారు అల్లు అర్జున్. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన గంగోత్రితో టాలీవుడ్లో అడుగుపెట్టిన బన్నీ తన మొదటి సినిమాకు పలు విమర్శలు ఎదుర్కొన్నా వాటిని అదిగమించి రెండో సినిమా ఆర్యతోనే స్టైలిష్ స్టార్ అనిపించుకున్నారు. ఇక, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన బన్నీ తెలుగు ప్రేక్షకులనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో బన్ని మాస్ లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డిక్షన్ అభిమానులను కట్టిపడేసాయి. దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో భారీ కలెక్షన్లు రాబట్టిన పుష్ప బన్ని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 2003లో విడుదలైన గంగోత్రి నుంచి పుష్ప వరకు చాలా అవార్డులు అందుకున్నారు బన్ని. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు(ఏప్రిల్ 08) సందర్భంగా ఆయన ఇరవై ఏళ్ల కెరీర్లో అందుకున్న అవార్డులేంటో తెలుసుకుందాం..
IIFA
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ(IIFA)అవార్డుల్లోనూ అల్లు అర్జున్ మూడు సార్లు ఉత్తమ నటుడు కేటగిరీలో నామినేట్ అయ్యారు. కాగా, రుద్రమదేవి సినిమాకుగాను బన్ని ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో ఈ అవార్డు అందుకున్నారు.
SIIMA
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు(SIIMA)ల్లోనూ పలు సినిమాలకుగాను ఉత్తమ నటుడు కేటగిరీలో నామినేషన్స్‌కు ఎంపికైన బన్నీ రేసుగుర్రం సినిమాకుగానూ స్టైలిష్ యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా అవార్డు అందుకున్నారు. అంతేకాదు, ఉత్తమ నటుడిగా రుద్రమదేవి, అలవైకుంఠపురంలో.., పుష్ప సినిమాలకూ సైమా అవార్డు అందుకున్నాడు బన్నీ.
నంది అవార్డులు
అల్లు అర్జున్ తెరంగేట్రం చేసిన మొదటి సినిమాకే నంది అవార్డుకు నామినేట్ అయి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. అంతేకాదు ఆర్య, పరుగు, వేదం సినిమాలకూ ఉత్తమ నటుడిగా, రుద్రమదేవి సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక నంది అవార్డులు అందుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.
ఫిలింఫేర్
సినీ పరిశ్రమలో ఉత్తమ నటులకు అందించే ప్రతిష్టాత్మక అవార్డులో ఒకటి ఫిలింఫేర్. ఈ అవార్డుల ఎంపికలో ఆర్య నుంచి పుష్ప వరకు పదిసార్లు నామినేట్ అయిన అల్లు అర్జున్ ఏకంగా ఆరు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. అల్లు అర్జున్ నటించిన పరుగు, వేదం, రేసుగుర్రం, పుష్ప సినిమాలకుగాను ఉత్తమ నటుడు కేటగిరీలో, రుద్రమదేవి సినిమాకుగానూ ఉత్తమ సహాయ నటుడిగా, సరైనోడు సినిమాకు ఉత్తమ నటుడు క్రిటిక్స్ ఛాయిస్ విభాగాల్లో ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకున్నారు.
సంతోషం
తెలుగు పరిశ్రమలో అందించే ప్రతిష్టాత్మక సంతోషం అవార్డుల్లోనూ అల్లు అర్జున్ సత్తా చాటారు. గంగోత్రి సినిమాకుగానూ బెస్ట్ డెబ్యూ హీరోగా, ఆర్య, బన్నీ సినిమాలకుగానూ బెస్ట్ యంగ్ పెర్ఫార్మర్గా సంతోషం సినిమా అవార్డులను అందుకున్నారు.
ఇవే కాకుండా, సాక్షి ఎక్సలెన్స్, TV9, జీ తెలుగు సినీ అవార్డ్స్, మిర్చి సౌత్ మ్యూజిక్, CineMAA,సౌత్ స్కోప్ లైఫ్‌స్టైల్ అవార్డులతో పాటు పలు అవార్డులను అందుకున్నారు. అంతేకాదు సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్యలోనూ రికార్డులు సృష్టించిన బన్నీ గూగుల్ సెర్చ్, మోస్ట్ ఫాలోయింగ్ సెలబ్రిటీ ఇన్ సోషల్ మీడియా వంటి టైటిల్స్ కూడా అందుకున్నారు.
ఇక, పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్థాయిలో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకు అర్జున్ మరో ప్రతిష్టాత్మక అవార్డును చేసుకున్నారు. గత సంవత్సరానికి గానూ ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును అందుకున్నారు. అంతేకాదు ఈ అవార్డున దక్కించుకున్న తొలి సౌత్ ఇండియన్ యాక్టర్‌గా బన్నీ నిలిచారు. ఈ అవార్డును కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు అంకితం ఇస్తున్నట్లు అల్లు అర్జున్ ప్రకటించారు. ప్రస్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న పుష్ప2 ది రూల్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు బన్ని. ఇక, బన్ని బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ పుష్ప2పై భారీ అంచనాలను పెంచేస్తోంది. అమ్మోరు అవతారంలో బన్ని లుక్స్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. సూపర్ సక్సెస్ఫుల్ హీరోగా సాగుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి న్యూస్ ఎక్స్ తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు.