వామ్మో.. ఈ ఫోన్ నెంబర్ వాడిన వారు మరణిస్తున్నారట..!
Phone Number: బల్గేరియాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఒక ఫోన్ నెంబర్ వల్ల ముగ్గురు మృతిచెందారు. దాంతో ఆ ఫోన్ నెంబర్‌ను ఎవ్వరూ వాడొద్దని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ అదేం నెంబర్ అంటే.. +359 888 888 888. 2010లో డెయిలీ మెయిల్ పత్రిలో ప్రచురించిన దాని ప్రకారం.. ఈ నెంబర్ వాడిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మృతిచెందారట.
దాంతో ఈ నెంబర్‌ను సస్పెండ్ చేసారు. ఈ నెంబర్‌ను వాడిన మొదటి వ్యక్తి బల్గేరియాకు చెందిన ప్రముఖ ఫోన్ కంపెనీ మోబిటెల్ సీఈఓ వ్లాదిమిర్ గ్రాష్నోవ్. ఈ నెంబర్ తీసుకున్న సమయంలో వ్లాదిమిర్ వయసు 48. ఇతను క్యాన్సర్‌తో 2001లో చనిపోయాడు. అతనికి ఈ నెంబర్ వాడక ముందు వరకు క్యాన్సర్ లేదట. ఈ నెంబర్ తీసుకున్నాక రేడియో యాక్టివ్ పాయిజనింగ్ కారణంగా క్యాన్సర్ వచ్చి చనిపోయారని అక్కడి వారు చెప్తున్నారు.
ఆ తర్వాత ఈ నెంబర్‌ను బల్గేరియాకు చెందిన మాఫియా బాస్ కోన్‌స్టాన్టిన్ డిమిట్రోవ్ వాడారు. ఇతను 2003లో కాల్పులకు గురై చనిపోయాడు. ఆ తర్వాత ఈ నెంబర్‌ను డిష్లీవ్ అనే వ్యాపారవేత్త తీసుకున్నాడు. ఇతను బల్గేరియాలోని భారతీయ రెస్టారెంట్‌లో హత్యకు గురయ్యాడు. అలా ఈ నెంబర్ తీసుకున్న ముగ్గరు వ్యక్తులు చనిపోవడంతో అక్కడి ప్రభుత్వం ఈ నెంబర్ ఇంకెవ్వరికీ ఇవ్వకుండా సస్పెండ్ చేసింది.