YS Sharmila: జ‌గన్ అన్న మాన‌సిక స్థితిపై నాకు భ‌య‌మేస్తోంది

YS Sharmila reacts on jagan comments against her

YS Sharmila: జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) మానసిక ప‌రిస్థితి చూస్తుంటే త‌న‌కు భ‌యంగా ఉంద‌ని అన్నారు APCC చీఫ్ వైఎస్ ష‌ర్మిళ‌. ఓ ఇంట‌ర్వ్యూలో జ‌గ‌న్ మాట్లాడుతూ.. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేరును కాంగ్రెస్ సీబీఐలో చేర్చింద‌ని.. అలాంటి కాంగ్రెస్ వంచ‌న చేరిన త‌న చెల్లెలు ష‌ర్మిళను చూస్తుంటే బాధ‌గా ఉంద‌ని అన్నారు. అంతేకాదు.. ష‌ర్మిళ చంద్ర‌బాబు నాయుడు చెప్పుచేత‌ల్లో ఉంద‌ని.. ఆయ‌న చెప్పిన‌ట్లే ప్ర‌సంగాలు చేస్తోంద‌ని అన్నారు. దీనిపై ష‌ర్మిళ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు.

“” అస‌లు రాజ‌శేఖ‌ర్ రెడ్డి బిడ్డ చంద్ర‌బాబు నాయుడు చెప్పిన‌ట్లు వినడం ఏంటి? నేను ఆయ‌న చెప్పిన‌ట్లు న‌డుచుకుంటున్నాను అని ఆరోపించ‌డానికి మీ ద‌గ్గ‌ర ఆధారాలు ఉంటే చూపించండి. నా జ‌న్మలో ఒక్క‌సారి నా బిడ్డ పెళ్లి జ‌రుగుతోంద‌ని చంద్ర‌బాబు నాయుడు ఇంటికి వెళ్లి శుభ‌లేఖ ఇచ్చాను. ఆ త‌ర్వాత ఒక ఐదు నిమిషాలు కూడా ఆయ‌న‌తో మాట్లాడింది లేదు. నేను చంద్ర‌బాబు నాయుడు ఇంటికి వెళ్లి శుభలేఖ ఇవ్వ‌డానికి కార‌ణం.. నా పెళ్లి స‌మ‌యంలో కూడా నాన్న చంద్ర‌బాబు నాయుడుకి కార్డు ఇచ్చారు. ఆయ‌న అడుగు జాడ‌ల్లో న‌డుస్తున్నాను కాబ‌ట్టే పెళ్లి కార్డు ఇవ్వ‌డానికి వెళ్లాను.

ఆ మాత్రం దానికే నేను ఆయ‌న చెప్పిన‌ట్లు వింటున్నానని ఎలా అంటారు? నేనే కాదు.. నా చెల్లెలు సునీతా రెడ్డి కూడా ఆయ‌న చెప్పుచేత‌ల్లో ఉంద‌ట‌. తండ్రి పోయిన బాధ‌లో న్యాయం కోసం తొక్క‌ని గ‌డ‌ప లేక అల్లాడిపోతున్న సునీత‌పై ఇలాంటి ఆరోప‌ణ‌లు ఎందుకు? మీ ద‌గ్గ‌ర ఆధారాలుంటే చూపించండి. జ‌గ‌న్ మాన‌సిక స్థితి స‌రిగ్గా లేదేమో అని నాకు భ‌య‌మేస్తోంది “” అంటూ సెటైర్లు వేసారు.