స్కూల్‌కి లేట్‌గా వచ్చిన టీచర్‌ను చితకబాదిన ప్రిన్సిపల్
Viral News: స్కూల్‌కి ఆలస్యంగా వచ్చే విద్యార్ధులను టీచర్లు కొట్టడం చూసాం కానీ.. టీచర్ ఆలస్యంగా వచ్చిందని ప్రిన్సిపల్ చితకబాదడం ఎప్పుడైనా విన్నారా? ఈ విచిత్ర ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. ఆగ్రాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ నిన్న ఆలస్యంగా వచ్చింది. దాంతో అక్కడే ఉన్న ప్రిన్సిపల్ ఆమె బుగ్గలు లాగుతూ చావబాదింది. పక్కనే ఉన్న తోటి టీచర్లు ప్రిన్సిపల్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో టీచర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. పిల్లల ముందు ఇలా కొట్టుకుంటే ఇక వారికి చదువు ఏం నేర్పిస్తారు అంటూ మండిపడుతున్నారు. ఇంకొందరైతే.. పిల్లల్ని కొట్టడానికి టీచర్లు ఉంటే టీచర్లను కొట్టడానికి ప్రిన్సిపల్ ఉండాలి కదా అంటూ వెక్కిరిస్తున్నారు.