YS Avinash Reddy: తండ్రీ కొడుకులకు భారీ ఊరట
YS Avinash Reddy: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో వైఎస్ అవినాష్ రెడ్డికి అతని తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి భారీ ఊరట లభించింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి అవినాష్ బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అంతేకాదు.. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తండ్రీ కొడుకులకు భారీ ఊరట లభించిందనే చెప్పాలి.