త‌ప్పు చేస్తున్నావ్ నాన్నా.. ముద్ర‌గ‌డ కూతురి షాకింగ్ కామెంట్స్

mudragada padmanabham daughter slams his father for scolding pawan kalyan

మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం (Mudragada Padmanabham) కుమార్తె క్రాంతి త‌న తండ్రిపై మండిప‌డ్డారు. కేవ‌లం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను తిట్టేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ త‌న తండ్రిని పార్టీలో చేర్చుకుంద‌ని.. త‌న తండ్రికి తన‌తో పాటు ఆయ‌న అభిమానులు కూడా వ్య‌తిరేకంగా ఉన్నార‌ని తెలిపారు. త‌న మ‌ద్ద‌తు మాత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కే అని ఆయ‌న గెలుపు కోసం త‌న వంతు సాయం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల త‌ర్వాత ముద్ర‌గ‌డ‌ను వైఎస్సార్ కాంగ్రెస్ వారు పార్టీ నుంచి త‌రిమేయ‌డం ప‌క్కా అని తెలిపారు.