Mehreen: త‌న అండాన్ని ఫ్రీజ్ చేయించుకున్న మెహ‌రీన్

Mehreen froze her eggs

Mehreen: న‌టి మెహ్రీన్ పీర్జాదా త‌న అండాన్ని ఫ్రీజ్ చేయించుకున్నారు. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా వెల్ల‌డిస్తూ.. పెళ్లి ఎప్పుడు చేసుకోవాలో ఎప్పుడు పిల్ల‌ల్ని కనాలో తెలీని ఆడ‌వాళ్లంతా ఈ ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు.

“” గ‌త రెండేళ్లుగా ఈ నిర్ణయాన్ని తీసుకోవాలా వ‌ద్దా అని ఆలోచిస్తున్నా. మొత్తానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. నేను నా అండాన్ని ఫ్రీజ్ చేయించుకున్నాను. నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో ఎప్పుడు పిల్ల‌ల్ని కంటానో తెలీదు. నాకు పిల్ల‌ల్ని క‌నాల‌ని ఉన్న‌ప్పుడు నేను ఫ్రీజ్ చేయించుకున్న అండాలు ప‌నికొస్తాయి. కాబ‌ట్టి నాలా ఆలోచించే ఆడ‌వాళ్లు ఉంటే వారు కూడా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాల‌ని కోరుకుంటున్నాను “” అని తెలిపారు.

న‌టి మృణాల్ ఠాకూర్ కూడా త‌న అండాన్ని ఫ్రీజ్ చేయించుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిపారు. ఈ ప్రేమ‌లు పెళ్లిళ్ల‌పై న‌మ్మ‌కం లేద‌ని.. కానీ పిల్ల‌ల్ని కనాల‌ని ఉంద‌ని.. అందుకే అండాన్ని ఫ్రీజ్ చేయించుకోవాల‌ని అనుకుంటున్నాన‌ని పేర్కొన్నారు. బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా, రామ్‌చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కామినేనిలు కూడా అలాగే పిల్ల‌ల్ని క‌న్నారు.

వెబ్‌సైట్ కోసం https://telugu.newsx.com/ అని టైప్ చేయండి