Janasena: ఎన్నిక‌ల ప్ర‌చారానికి బ‌డ్జెట్ ఎంత‌?

what is the janasena budget to campaign in the ap elections

Janasena: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో (AP Elections) ఎలాగైనా ఎమ్మెల్యేగా గెల‌వాల‌ని ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ కోసం రాజ‌కీయ నాయ‌కులు, జ‌బ‌ర్ద‌స్త్‌కి చెందిన స్టార్ క్యాంపెయిన‌ర్లు, జ‌న‌సేన పార్టీలో చేరిన ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్టర్‌తో పాటు ఆయ‌న కుటుంబీకులు కూడా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు.

అయితే ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి జ‌న‌సేన ఎంత ఖ‌ర్చు చేస్తోందో తెలుసా? అక్ష‌రాలా రూ.100 కోట్లు అని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెప్తున్నాయి. ప్ర‌చారంలో పాల్గొనేందుకు మెగా హీరోల‌కు ఫ్లైట్ టికెట్ ఖ‌ర్చులు, జ‌బ‌ర్త‌స్త్ క‌మెడియ‌న్లు అయిన సుడిగాలి సుధీర్, హైప‌ర్ ఆది, గెట‌ప్ శ్రీను, రాం ప్ర‌సాద్‌ల పారితోషిక‌మే దాదాపు రూ.20 కోట్ల వ‌ర‌కు ఉంది. దీంతో పాటు పిఠాపురంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తున్న స్థానిక తెలుగు దేశం పార్టీ నేత ఎస్వీఎస్ఎన్ వ‌ర్మకు ప్ర‌చారానికి రోజుకు రూ.2 కోట్ల వర‌కు ఇస్తున్నార‌ని స‌మాచారం. ప‌వ‌న్ వ‌ద్ద అంత డ‌బ్బు లేక‌పోవ‌డంతో తెలుగు దేశం పార్టీనే ఫండింగ్ ఇస్తోంద‌న్న టాక్ కూడా ఉంది.

అన్ని వార్తలను చూసేందుకు https://telugu.newsx.com/ అని టైప్ చేయండి