KCR ఎన్నికల ప్రచారాన్ని నిషేధించిన ఈసీ
KCR: ఎన్నికలకు ముందు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎన్నికల సంఘం నుంచి భారీ షాక్ తగిలింది. 48 గంటల పాటు కేసీఆర్ ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొకూడదని ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వంలో అందరూ లత్కోర్లే ఉన్నారని కేసీఆర్ వ్యాఖ్యానించడంతో పలువురు కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కేసీఆర్కు తెలీదా అంటూ ఆయనపై సంఘానికి ఫిర్యాదు చేయడంతో 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.