T20 World Cup: పాండ్యను వైస్ కెప్టెన్ చేయాలని చెప్పింది రోహితే
T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో ఆడబోయే వారి పేర్లను BCCI ప్రకటించేసింది. రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోగా.. హార్దిక్ పాండ్య (Hardik Pandya) వైఎస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. అయితే పాండ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడి ఇప్పటికి ఆరు నెలలు అవుతోంది. అయినప్పటికీ పాండ్యను వైస్ కెప్టెన్‌గా ఎలా నియమించారా అని చాలా మంది సందేహిస్తున్నారు. దీని వెనుక ఉన్నది రోహిత్ శర్మనే అని తెలిపారు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.
టీ20 వరల్డ్ కప్ సిరీస్‌లలో రోహిత్ కంటే ముందు పాండ్య కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడని.. ఆ తర్వాత రోహిత్‌కి అప్పగించారని కైఫ్ తెలిపారు. హార్దిక్, రోహిత్ లేని సమయంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. తనకు పాండ్య వైస్ కెప్టెన్‌గా కావాలని రోహిత్ శర్మనే సెలెక్టర్లను రిక్వెస్ట్ చేసాడని కైఫ్ వెల్లడించారు. గతంలో రోహిత్ పాండ్యతో కలిసి ఆడాడు కాబట్టి పాండ్య సామర్ధ్యం ఏంటో రోహిత్‌కి బాగా తెలుసని.. రోహిత్ నిర్ణయాన్ని సెలెక్టర్లు కూడా గౌరవించడం మంచి విషయం అని కైఫ్ అభిప్రాయపడ్డారు.