“ఆ మహిళలు అసహ్యంగా ఉంటారు.. రేప్ కూడా చేయబుద్ది కాదు”
Canada: కెనడాకు చెందిన ఓ వృద్ధురాలు జాతివివక్ష వ్యాఖ్యలు చేసి చిక్కులపాలైంది. ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆమె పాలెస్తీనాకు బాసటగా నిలిచారు. పాలెస్తీనా నలిగిపోతోందని ఆ ప్రాంతాన్ని.. ఆ ప్రాంత ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుందంటూ జెండా చేతపట్టుకుని కెనడా వీధుల్లో తిరిగారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ మీడియా కెమెరా ముందుకు వెళ్లి.. యూదు మహిళలు అసహ్యంగా ఉంటారని.. వారిని కండోమ్ పెట్టుకునే రేప్ చేయాలని షాకింగ్ కామెంట్స్ చేసారు.
కెనడాలోని విక్టోరియాలో పాలెస్తీనాకు మద్దతుగా ధర్నా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ యూదు యువతి అత్యాచారం ప్రతిఘటన కాదు అనే ప్లకార్డు పట్టుకుని నిలబడి ఉంది. ఆ పక్కనే మీడియా వర్గాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో ఈ వృద్ధురాలు వెళ్లి ఆ యూదు మహిళ ముందే వారు అసహ్యంగా ఉంటారని వారిని రేప్ చేయబుద్ది కాదని.. ఒకవేళ చేయాలన్నా కండోమ్ వేసుకుని చేయాలని నీచంగా మాట్లాడి పాపం ఆ పిల్లను అవమానించింది.