TDP BJP Janasena Manifesto: మోదీ ఫోటో మిస్సింగ్!
TDP BJP Janasena Manifesto: ఈరోజు కూటమి (జనసేన, తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీలు) మేనిఫెస్టో ప్రకటించనున్నారు. మూడు పార్టీలు బాగా చర్చించి ప్రజలకు మేలు జరిగే విధంగా మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఈరోజు మేనిఫెస్టోను ప్రకటించనున్న నేపథ్యంలో ఓ కామన్ పోస్టర్ను డిజైన్ చేసారు. పోస్టర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో మిస్సవడం చర్చకు దారి తీసింది. దాంతో ఉమ్మడి మేనిఫెస్టోని మోదీ గ్యారెంటీ ఇవ్వడంలేదా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.