Varalakshmi Sarathkumar: నా కళ్ల‌కు అందంగానే క‌నిపిస్తున్నాడు

Varalakshmi Sarathkumar:  ప్ర‌ముఖ న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ఈ ఏడాది ఓ ఇంటి వారు కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలెరిస్ట్ నికోలాయ్ స‌చ్‌దేవ్‌ను (Nicholai Sachdev) ఆమె ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. కొన్ని రోజుల క్రిత‌మే పెద్ద‌ల స‌మ‌క్షంలో వీరి నిశ్చితార్ధం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.

అయితే నికోలాయ్ ఆకారంపై సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రోల్స్ వ‌స్తున్నాయి. అస‌లు వీడెలా న‌చ్చాడు నీకు? ఎంత అసహ్యంగా ఉన్నాడో నీకు క‌నిపించ‌డంలేదా అంటూ వ్య‌క్తిగ‌త ధూష‌ణ‌ల‌తో కామెంట్స్ పెడుతున్నారు. త‌న‌కు కాబోయే వాడిపై వ‌స్తున్న ట్రోల్స్‌పై వ‌ర‌ల‌క్ష్మి స్పందించారు. “” నికోలాయ్‌కి ఇది రెండో పెళ్లి. అందులో త‌ప్పేముంది? నా తండ్రి కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆయ‌న సంతోషంగా ఉన్నారా లేరా అనేదే ముఖ్యం. నికోలాయ్ బాలేడంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. నేను అస్స‌లు ప‌ట్టించుకోను. ఎందుకంటే అత‌ను నా క‌ళ్ల‌కు అందంగా హ్యాండ్స‌మ్‌గా క‌నిపిస్తున్నాడు. అయినా ఒక‌రికి స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం నాకు లేదు. నా జీవితం నా ఇష్టం “” అని ట్రోల్స్‌కి మూతి ప‌గిలేలా స‌మాధానం ఇచ్చారు వ‌ర‌ల‌క్ష్మి.