YS Bharathi: చంద్రబాబు పెద్దవారు.. అలా మాట్లాడితే ఎలా?
YS Bharathi: నిన్ను చంపేస్తే దిక్కెవరు అని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. (Chandrababu Naidu) జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) గురించి మాట్లాడటంపై తీవ్ర దుమారం రేగింది. దీనిపై జగన్ భార్య వైఎస్ భారతి స్పందించారు. చంద్రబాబు నాయుడు వయసులో పెద్దవారని.. ఎలా మాట్లాడాలో తెలీకపోతే ఎలా అని ప్రశ్నించారు. అలా మాట్లాడటం ఎంత వరకు కరెక్టో ఆయన విచక్షణకే వదిలేస్తున్నానని అన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడేవారు.. ఇలాంటి హత్యా రాజకీయాలు చేసేవారిని దేవుడే చూసుకుంటాడని.. ఏమున్నా ప్రజల్లో తేల్చుకోవాలి కానీ బెదిరింపులకు పాల్పడటం చాలా తప్పని అన్నారు.