Irfan Pathan: హార్దిక్‌కి వీఐపి ట్రీట్మెంట్ అవ‌స‌ర‌మా?

Irfan Pathan: మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ BCCIపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. క్రికెట‌ర్ హార్దిక్ పాండ్య‌కు (Hardik Pandya) ఎందుకు వీఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నార‌ని అంత అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. ఒక ఆల్ రౌండ‌ర్ అయ్యుండి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో పాండ్య త‌న స‌త్తా నిరూపించుకోలేపోయాడ‌ని అలాంట‌ప్పుడు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో అత‌నిపై అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నార‌ని నిల‌దీసారు.

ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్య ఈ సారి ఐపీఎల్‌లో పేలవ‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చి అంద‌రి నోట నానుతున్నాడు. అలాంటిది అత‌న్ని టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లోనూ తీసుకోవాల‌ని BCCI భావిస్తోంది. త‌ర‌చూ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్, టీ20 మ్యాచ్‌ల‌ను ఎగ్గొట్టిన పాండ్యకు BCCI నుంచి ఎలాంటి పెనాల్టీలు ప‌డలేదు. కానీ ఇషాన్ కిష‌న్, శ్రేయ‌స్ అయ్య‌ర్‌ల‌పై మాత్రం యాక్ష‌న్ తీసుకుంది. ఈ నేప‌థ్యంలో పాండ్య‌కు ఇత‌ర క్రికెట‌ర్ల‌కు ఇచ్చిన ట్రీట్మెంటే ఇవ్వాల‌ని ప్ర‌త్యేకంగా చూడాల్సిన ప‌ని లేద‌ని చుర‌క‌లంటించాడు.