స్టార్ హీరోలందరినీ లైన్లో పెట్టిన స్మార్ట్ డైరెక్టర్!
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాతో కోలీవుడ్ బాక్సాఫీస్ దద్దరిల్లిపోయిన విషయం తెలిసిందే. ఈ సినిమా విజయంతో హ్యాటిక్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరిపోయారు లోకేష్ కనగరాజు. ఖైదీ, మాస్టర్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నలోకేష్ హ్యాట్రిక్ హిట్స్ తో జోరు మీదున్నారు. లోకేష్ ప్రస్తుతం దళపతి విజయ్‌తో సినిమా చేస్తున్నారు. లియో టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన విజయ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా, లోకేష్ సినిమాలన్నీ ఒకదానికొకటి జతచేసి ఉండి యూనివర్స్‌గా ఓ సిరీస్ రూపంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా లోకేష్ మరో సూపర్ స్టార్‌ని తన యూనివర్స్‌లో భాగం చేస్తున్నట్టు తెలుస్తోంది.
కోలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న లోకేష్.. ఇప్పటికే నలుగురు స్టార్ హీరోలను తన యూనివర్స్ లో భాగం చేశారు. ఇక, ఈసారి మరో స్టార్‌ను కూడా తన యూనివర్స్ లోకి తీసుకుని రానున్నట్టు ప్రచారం జరుగుతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ ఒక మూవీ ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీకి సంబంధించిన చర్చలు ప్రస్తుతం నడుస్తున్నాయని తెలుస్తోంది. ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలను సిరీస్‌గా తెరకెక్కించిన లోకేష్ కనగరాజ్.. తన యూనివర్స్ లో వీటన్నింటినీ భాగం చేశారు. ప్రస్తుతం చేస్తున్న లియో సినిమాను కూడా అందులో భాగం చేసినట్టు తెలిపారు. లియో సినిమా షూటింగ్ ఇప్పటికే 25 శాతం పూర్తయ్యిందని స్పష్టం చేశారు. కాగా, ఇటీవల జరిగిన ఒక అవార్డు వేడుకలో స్టార్ హీరో సూర్యతో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు లోకేష్. ఆ సినిమాను కేవలం 150 రోజుల్లోనే పూర్తిచేస్తానని కూడా చెప్పారు. ఇప్పటికే రజినీకాంత్ కి లోకేష్ కథ కూడా చెప్పారని టాక్. కోలీవుడ్ లో బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుందని సమాచారం. ఇక మూవీకి సంబంధించిన మాటలు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయని, త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టాక్.
ఇక లోకేష్ యూనివర్స్ సిరీస్ లో భాగంగానే ఈ మూవీ కూడా ఉంటుందనే మాట కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం రజినీకాంత్ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత బింబిసార దర్శకుడితో సినిమా ఉండే అవకాశం ఉందనే ప్రచారం ఉంది. ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. ఇక, చాలాకాలం నుంచి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కమల్ హాసన్‌కు విక్రమ్ సినిమా బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా క్లైమాక్స్ లో తమిళ స్టార్ హీరో సూర్య రోలెక్స్ గా కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. సూర్య, కార్తీ, కమల్ హాసన్, విజయ్‌తో లోకేష్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తన సినిమాల యూనివర్స్‌లోకి రజినీకాంత్‌ను కూడా తీసుకొస్తే ఇక అభిమానులకు పండగే.