YS Sharmila: షర్మిళ అఫిడవిట్‌లో ఆసక్తికర అంశాలు
YS Sharmila: ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ. ఈరోజు షర్మిళ నామినేషన్ దాఖలు చేసారు. అయితే నామినేషన్ వేస్తున్న సమయంలో ఆమె అఫిడవిట్‌లో ఆసక్తికర అంశాలను పేర్కొన్నారు. తన అన్న జగన్ మోహన్ రెడ్డి నుంచి షర్మిళ రూ.82 కోట్లు అప్పు తీసుకున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. వదిన భారతి రెడ్డి నుంచి రూ.19.56 లక్షలు అప్పు తీసుకున్నట్లు కూడా పేర్కొన్నారు. దీంతో పాటు.. తన భర్త అనిల్‌కు రూ.30 కోట్లు అప్పుగా ఇచ్చారట. ఇక విజయమ్మ నుంచి అల్లుడు అనిల్ రూ.40 లక్షలు అప్పుగా తీసుకున్నారు.
ALSO READ: