గులకరాయికే అల్లాడుతున్నావ్ .. నీవే ప్రాణాలా? బాబాయివి కావా?
YS Sharmila: “” ఏం జగనన్నా.. ఒక చిన్న గులకరాయికే అల్లాడుతున్నావే.. నీవేనా ప్రాణాలు? బాబాయివి కావా? “” అన్ని ప్రశ్నించారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో షర్మిళ కడప ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నామినేషన్ వేసారు. ఈ సందర్భంగా షర్మిళ మాట్లాడుతూ..
“” ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని మేం ప్రచారంలో వివేకా హత్య కేసు గురించి మాట్లాడకూడదని కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చారు. మరి 2019 ఎన్నికల సమయంలో ఇదే వివేకా హత్యను అడ్డుపెట్టుకుని సాక్షి పేపర్, ఛానెల్‌లో నారాసుర రక్తచరిత్ర అని రాసినప్పుడు లేదా? ఇప్పుడు మేం మాట్లాడితే తప్పేంటి? చిన్న గులకరాయి తగిలితేనే ఇంత అల్లాడుతున్నావే మరి బాబాయిని ఏడుసార్లు నరికి.. ఆయన మెదడు, తలలోని ఎముకలు బయటికి కనిపించేలా హత్య చేసినప్పుడు బాధ కలగలేదా? “” అని ప్రశ్నించారు షర్మిళ
ALSO READ: