War 2: ఈ మాత్రం దానికేనా? చెప్ప‌లేదా తార‌క్ గురించి?

War 2: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (JR NTR) వార్ 2 సినిమా కోసం ముంబై వెళ్లిన సంగ‌తి తెలిసిందే. తార‌క్ న‌టించ‌బోయే తొలి భారీ బాలీవుడ్ సినిమా ఇది. అయ‌న్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్ కూడా నటిస్తున్నారు. ఆల్మోస్ట్ షూటింగ్ కూడా మొద‌లైపోయంది. అయితే తార‌క్ సెట్స్‌లో ఎంతో ప్రొఫెష‌న‌ల్‌గా ఉండ‌టం చూసి వార్ 2 చిత్ర బృందం ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌. సెట్స్‌లో అంద‌రు హీరోలు ఇంతే ప్రొఫెష‌న‌ల్‌గా ఉంటే సినిమా షూటింగ్స్ స‌మ‌యానికి జ‌రిగిపోతాయ‌ని నిర్మాత‌ల‌కు ఎలాంటి న‌ష్టం ఉండ‌ద‌ని అంటున్నారు.

అంతేకాదు.. అయాన్ చెప్పే హిందీ డైలాగులను కూడా తార‌క్ ఫాస్ట్‌గా చెప్పేస్తున్నార‌ట‌. స్టంట్స్ కూడా తారక్ చాలా తేలిక‌గా చేసేస్తున్నాడ‌ని బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

ALSO READ:

JR NTR: తార‌క్‌తో హాట్ హీరోయిన్ సెల్ఫీ వైర‌ల్.. ఎందుకో తెలుసా?

JR NTR: మీకెలా తెలుసు నేనొచ్చాన‌ని.. షాకైన తార‌క్!

https://telugu.newsx.com/tag/jr-ntr/