Megha Reddy: ఎమ్మెల్యే మేఘా రెడ్డిపై మర్డర్ అటెంప్ట్
Megha Reddy: కాంగ్రెస్ వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. మేఘా రెడ్డి కాంగ్రెస్‌లో చేరికలపై మాట్లాడుతుండగా.. పక్కనే ఉన్న ఇతర కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా ఆయనపై పెట్రోల్ పోసేందుకు యత్నించారు. గణేష్ గౌడ్ అనే కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గణేష్ గౌడ్ మాజీ మంత్రి చిన్నా రెడ్డి అనుచరుడు. ఇంకోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని మేఘా రెడ్డి అనుచరలు వార్నింగ్ ఇచ్చారు. పెట్రోల్ పోస్తున్న సమయంలో కాస్తంత అగ్గి రగిల్చినా తీవ్ర ప్రమాదం చోటుచేసుకుని ఉండేదని వారు వాపోయారు. ప్రస్తుతం మేఘారెడ్డి పరిస్థితి నిలకడగానే ఉంది.
ALSO READ:
KTR: తప్పు రేవంత్ రెడ్డిది కాదు… మాదే!
Uttam: మేడిగడ్డపై మరమ్మతులు ఎవడు చేయమన్నాడు?