శవాన్ని బ్యాంక్‌కు తీసుకెళ్లి.. లోన్ అప్లై చేసి..
Viral News: ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతున్న బంధువును బ్యాంక్‌కు తీసుకెళ్లింది. ఆయన పేరిట లోన్ తీసుకోవాలని అనుకుంది. అతన్ని వీల్‌ఛైర్‌లో కూర్చోపెట్టి కష్టపడి బ్యాంక్ లోపలికి తీసుకెళ్లింది. తీరా లోన్ అప్లై చేస్తున్న సమయంలో అతని సంతకాలు తీసుకోవాలని చూడగా… అతను ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు. దాంతో బ్యాంక్‌లో ఉన్నవారంతా షాకయ్యారు. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది.
స్థానిక రయో డి జనీరియో బ్యాంక్‌కు ఆ పేషెంట్‌ను యువతి వీల్‌ఛైర్‌లో కూర్చోపెట్టి తీసుకెళ్లినప్పుడు చాలా మంది షాకయ్యారు. ఆ వీల్‌ఛైర్‌లోని వ్యక్తి కొన ఊపిరితో ఉన్నాడు. అప్పటికే బ్యాంకు వారికి అనుమానం కలిగింది. ఆమె అతని పేరుతో లోన్ తీసుకుని సంతకాలు చేయించాలనుకునే సమయానికే అతను చనిపోయాడు. దాంతో వెంటనే బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫోన్ చేయడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
Brazilian woman takes uncle's corpse to a bank and tries to take a loan on his name pic.twitter.com/FV70dlWzkf
— Restricted Vids (@RestrictedVids) April 17, 2024
ALSO READ:
తాగిన మైకంలో టాటూ ఆర్టిస్ట్.. మహిళ చేతిపై పురుషాంగం బొమ్మ!
లైవ్ టీవీలో గ్రహణానికి బదులు మర్మాంగాన్ని చూపించేసారు!
Viral News: జూనియర్ భార్య కావలెను.. లింక్డిన్‌లో జాబ్ ఆఫర్