Malaika Arora: నీ ఫ‌స్ట్ సెక్స్ ఎప్పుడు.. షోలో కుమారుడిని అడిగేసిన మ‌లైకా

Malaika Arora: బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటారు. అఫ్‌కోర్స్.. చాలా మ‌టుకు ఆమె కావాల‌నే ప‌బ్లిసిటీ కోసం ఏదో ఒక ర‌కంగా ట్రెండ్ అవ్వాల‌ని కొన్ని వ్యాఖ్య‌లు చేస్తుంటారు. అయితే త‌న కుమారుడు అర్హాన్ ఖాన్‌ని ప‌ట్టుకుని అడ‌గ‌కూడ‌ద‌ని ప్ర‌శ్న అడ‌గడంతో ఇప్పుడు ఆమె టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు.

మ‌లైకా అర్హాన్‌తో క‌లిసి డంబ్ బిరియానీ అనే షో చేస్తున్నారు. తొలిసారి త‌ల్లీ కొడుకులు క‌లిసి చేస్తున్న షో ఇది. దాంతో కాస్త ఘాటు కామెంట్స్ చేస్తే షోకి పాపులారిటీ వ‌స్తుంద‌ని.. కాస్త మితిమీరిన సంభాష‌ణ‌లు జ‌రిపారు. ఈ షోకి సంబంధించిన ఓ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో మ‌లైకా.. త‌న కుమారుడితో నువ్వు ఎప్పుడు వ‌ర్జినిటీ కోల్పోయావ్? అని అడిగేసింది. దాంతో అర్హాన్ షాక‌య్యాడు. త‌ల్లి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌లేక‌.. మ‌రి నువ్వెప్పుడు మ‌ళ్లీ పెళ్లి చేసుకుంటావ్? అని అడిగాడు. అలా త‌ల్లీ కొడుకులు క‌లిసి ఇలాంటి టాపిక్‌పై చ‌ర్చించుకోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

స‌ల్మాన్ ఖాన్ సోద‌రుడు అర్బాజ్ ఖాన్, మ‌లైకాకు పుట్టిన కుమారుడే అర్హాన్. అర్హాన్ పుట్టిన కొన్ని సంవ‌త్స‌రాల‌కే వారిద్ద‌రూ విడిపోయారు. ఆ త‌ర్వాత అర్బాజ్.. షూరా అనే మ‌రో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మ‌లైకా త‌న‌కంటే వ‌య‌సులో ప‌దేళ్లు చిన్న‌వాడైన బాలీవుడ్ న‌టుడు అర్జున్ క‌పూర్‌తో డేటింగ్‌లో ఉన్నారు.

ALSO READ:

దేవుడా.. మాజీ వియ్యంకుడితో హీరోయిన్ త‌ల్లి డిన్న‌ర్ డేట్!

Arbaaz Khan: అటు భార్య.. ఇటు ప్రేయ‌సి.. చివ‌రికి మేక‌ప్ ఆర్టిస్ట్‌తో పెళ్లి

Malaika Arora: అర్జున్ క‌పూర్‌తో బ్రేక‌ప్..?!