ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు TDP నేత వార్నింగ్

Pawan Kalyan: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి తెలుగు దేశం పార్టీ శ్రీకాళ‌హ‌స్తి నేత బొజ్జ‌ల సుధీర్ రెడ్డి (Bojjala Sudheer Reddy) వార్నింగ్ ఇచ్చారు. మిత్రపక్షం అని ఊరుకున్నా.. లేదంటే శ్రీకాళహస్తిలో జనసేనను ఖాళీ చేసేవాడిని అంటూ పవన్ కళ్యాణ్‌ను ప‌రోక్షంగా హెచ్చ‌రించారు. మాజీ మంత్రి, శ్రీకాళహస్తి కూటమి అభ్యర్ధి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కుమారుడు అయిన‌ బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల జ‌నసైనికులు, కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు. అంద‌రం కూట‌మిలో భాగంగా న‌డుచుకుందాం అని పెద్ద‌లు ఎన్నిసార్లు చెప్పినా ఇలా స‌భ‌లు పెట్టేసి మిత్ర ప‌క్షాల‌నే తిడుతుంటే ఎందుకు స‌హించాలి అని మండిప‌డుతున్నారు.