పుష్ప మేకింగ్ వీడియోలో జ‌గ‌న్..!

Jagan: అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమాకు.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? మొన్న జగ‌న్ మోహ‌న్ రెడ్డిపై రాళ్ల దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ దాడిలో జ‌గ‌న్ ఎడ‌మ కంటిపై తీవ్ర గాయం అయ్యింది. అయితే ఆ గాయాన్ని జ‌గ‌న్ సింప‌తీ క్రియేట్ చేయ‌డం కోసం త‌న‌ని తానే గాయ‌ప‌రుచుకున్నాడ‌ని తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్‌కు త‌ల‌పై గాయం అయిన‌ట్లుగా ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. ఆ మేకింగ్ వీడియోలో జ‌గ‌న్‌ను యాడ్ చేసి జ‌న‌సేన సెటైర్ వేసింది. త‌న‌ని తానే గాయం చేసుకుని జ‌గ‌న్ డ్రామాలు ఆడుతున్నాడు అని తెలిపేందుకు ఇలా పుష్ప మేకింగ్ వీడియోను వాడుకున్నార‌న్న‌మాట‌.