పెళ్ళి కావాలంటే శ్రీరామ నవమి రోజు ఇలా చెయ్యండి
Ram Navami: ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కావడం లేదా? అయితే ఈ నెల 17న వస్తున్న శ్రీరామ నవమి రోజున ఇలా చేసి చూడండి. మంచి సంబంధాలు వస్తాయి. శ్రీరామ నవమి రోజున సీతారాముల వారి కళ్యాణం చేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. దగ్గర్లో ఏదన్నా రామాలయంలో రాముల వారి కళ్యాణం జరిగే సమయానికి వెళ్లి రాముల వారి తలపై పడ్డ తలంబ్రాలను తీసుకుని ఓ ఎర్రటి మూటలో కట్టి ఇంట్లోని పూజా గదిలో పెట్టుకుంటే ఎంతో మంచిది.
ఇలా చేస్తే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. నిరుద్యోగంతో బాధపడుతున్నవారికి ఉద్యోగం వస్తుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి. ఇలా అన్ని సమస్యాలకు ఆ తలంబ్రాలు సమాధానం చెప్తాయి. ఒకవేళ ఆల్రెడీ పెళ్లి కుదిరిపోయి ఉంటే గనక.. ఆ రాముల వారి తలంబ్రాలను వధూవరులు వేసుకునే తలంబ్రాల్లో కలిపితే మరీ మంచిదని నిపుణులు చెప్తున్నారు.
ALSO READ: Ram Navami విశిష్ఠత ఏంటి? ఆరోజున కళ్యాణం ఎందుకు చేస్తారు?