JR NTR: తార‌క్‌తో హాట్ హీరోయిన్ సెల్ఫీ వైర‌ల్.. ఎందుకో తెలుసా?

JR NTR: బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శి రౌతెల..(Urvashi Rautela)  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. అయితే ఈ సెల్ఫీ ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది. ప్ర‌స్తుతం తార‌క్ ముంబైలో ఉన్నారు. వార్ 2 (War 2) షూటింగ్ కోసమ‌ని గ‌త వారం ఆయ‌న ముంబైలో ల్యాండ్ అయ్యారు. ఈ సంద‌ర్భంగానే ఊర్వ‌శి తార‌క్‌తో సెల్ఫీ దిగిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. సెల్ఫీలో తార‌క్ ముఖంలో చాలా మార్పు ఉంది. అస‌లు అక్క‌డ ఉన్న తార‌కేనా లేక‌పోతే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఊర్వ‌శి ఇమేజ్ క్రియేట్ చేసి పోస్ట్ చేసారా అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఎందుకంటే ఫోటోలో తార‌క్ ముఖానికి ఫిల్ట‌ర్ ఉంది.

ఊర్వ‌శి పాపులారిటీ కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. గ‌తంలో క్రికెట‌ర్ రిష‌భ్ పంత్ విష‌యంలో కూడా ఊర్వ‌శి చాలా నాట‌కాలు ఆడి అత‌ని ప‌రువు తీసేసింది. ఆ త‌ర్వాత బ్రో సినిమా విష‌యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అని సంబోధిస్తూ ట్వీట్ చేసి ఆ త‌ర్వాత డిలీట్ చేసింది. సో ఈ సెల్ఫీ విష‌యంలో కూడా ఊర్వ‌శి ఫ్యాన్స్‌ని ఫూల్ చేస్తోందేమో అనే కామెంట్స్ వ‌స్తున్నాయి.