Sunitha Reddy: నాన్న‌తో నాకు విభేదాలున్నాయ్

Sunitha Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka Murder Case) హ‌త్య విష‌యం గురించి ఆయ‌న కుమార్తె సునీతా రెడ్డి ఈరోజు మ‌ళ్లీ ప్ర‌జెంటేష‌న్ వేసి చూపించారు. ఆ త‌ర్వాత మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పారు. అయితే వివేకాతో త‌న‌కు విభేదాలు ఉన్న మాట నిజ‌మే అని ఈ సంద‌ర్భంగా సునీత వెల్ల‌డించారు.

విభేదాలు ఉన్నంత మాత్రాన త‌న‌కు తండ్రి కాకుండాపోతాడా అని సునీత ప్ర‌శ్నించారు. కుటుంబంలో చిన్న‌పాటి స‌మ‌స్య‌లు అంద‌రి ఇళ్ల‌ల్లో ఉంటాయ‌ని.. అంత మాత్రాన వారితో బంధాలు తెంచుకుంటామా అని అడిగారు. త‌న తండ్రి బ‌తికున్న‌ప్పుడు ఎప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చినా త‌న ఇంట్లోనే ఉండేవారని.. అదే విధంగా తాను ఎప్పుడు పులివెందుల వెళ్లినా ఆయ‌న ఇంట్లోనే ఉండేదానిన‌ని తెలిపారు.