YS Sharmila: జ‌గ‌న్ అన్న‌పై దాడి.. కావాల‌ని చేసి ఉంటే…

YS Sharmila: జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై (Jagan Mohan Reddy) రాళ్ల దాడి జ‌రిగిన ఘ‌ట‌న‌పై స్పందించారు APCC అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ‌. ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగి ఎడమ కంటి పైన గాయం కావటం బాధాకరం, దురదృష్టకరం అని అన్నారు. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నామ‌ని… అలా కాకుండా, ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఖండించాల్సిందేన‌ని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని… హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందేన‌ని అన్నారు. జగన్ గారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు.