మాంసం తినడం పాపమా?
Spiritual: మాంసాహారం తినడం పుణ్యమా? పాపమా? ఈ మధ్యకాలంలో కులం, మతం బేధాలు లేకుండా చాలా మంది మాంసాహారం తినేస్తున్నారు. అసలు ఈ మాంసాహారం గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం.
శ్రీకృష్ణుడు తన బాల్యంలో ఒక చెట్టు కింద కూర్చుని ఫ్లూట్ వాయిస్తున్నాడు. అప్పుడు ఒక జింక పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడి వెనక దాక్కుంది. ఆ జింక భయపడుతుండడంతో జింక తలపై నిమురుతూ ఏమైంది ? ఎందుకు దాక్కున్నావ్ ? అని అడిగాడు. అదే సమయంలో జింకను వెతుక్కుంటూ ఒక వేటగాడు వచ్చాడు. ఈ జింక నా వేట. దీనిపై నాకే పూర్తి అధికారం ఉంది. నీ దగ్గర ఉన్న జింకను నాకిచ్చేయ్ అని వేటగాడు కృష్ణుడితో అన్నారు. అప్పుడు కృష్ణుడు.. ప్రతి జీవికి తన మీద తనకే అధికారం ఉంటుంది. మరెవ్వరికీ ఉండదు అని చెప్పాడు.
అప్పుడు ఆ వేటగాడు.. దీనిని నేను వండుకుని తింటాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు..ఏదైనా జీవిని చంపి తినడం అనేది పాపం అవుతుంది. నువ్వు ఈ జింకను చంపి పాపాన్ని మూటగట్టుకోవాలని అనుకుంటున్నావా? మాంసాహారం పుణ్యమా పాపమా అనే ధర్మం గురించి నీకు తెలీదు అన్నాడు. అప్పుడు వేటగాడు.. పుణ్య పాపాల గురించి నాకు అనవసరం. మాంసాహారం అనేది ఒక జీవికి తన జీవం నుంచి విముక్తి ఇస్తుంది. నేను ఈ జింకను చంపి దానికి విముక్తి కలిగిస్తున్నాను. ఆ విధంగా చూస్తే నేను పుణ్యం సంపాదించినట్లే అవుతుంది. మరి ఎందుకు అడ్డుకుంటున్నావ్? నేను విన్నదాని ప్రకారం జీవులను హత్య చేయడం గురించి శాస్త్రాల్లో చెప్పారు. రాజులు కూడా వేటకు వెళ్లి జంతువులను చంపుతుంటారు.
రాజులే ఇలా చేస్తున్నప్పుడు మాంసాహారం తప్పు ఎలా అవుతుంది? అని వేటగాడు కృష్ణుడిని ప్రశ్నించాడు. మాంసాన్ని ఎక్కువగా తింటుండడం వల్ల బుద్ధిని కోల్పోయాడని కన్నయ్యకు అర్థమైంది. దాంతో వేటగాడు అడిగిన ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెప్పకుండా కృష్ణుడు మౌనంగా ఉండిపోతాడు. నేను నీకు ఒక కథ చెప్తాను. కథ పూర్తిగా విన్నాక మాంసాహారం పుణ్యమా పాపమా అని నువ్వే చెప్పు అని కృష్ణుడు వేటగాడితో అన్నాడు. అప్పుడు వేటగాడు సరే అంటాడు.
అప్పుడు కృష్ణుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి మగద రాజ్యంలో కరువు వచ్చింది. దాంతో ఆహారం ఉత్పాదన తగ్గిపోయింది. వెంటనే ఈ సమస్యకు పరిహారం కనిపెట్టకపోతే మిగిలి ఉన్న కొంచెం ధాన్యం కూడా అయిపోతోంది. దాంతో కరువు ఇంకా పెరిగిపోతుంది అని మహారాజు బాధపడ్డాడు. ఈ విషయంపై మహారాజు సభలో ఉన్న అందరితో రాజు సమస్యను తీర్చడానికి అన్నిటికంటే చవకైన వస్తువు ఏంటి అని అడిగాడు. అప్పుడు మంత్రులంతా ఆలోచనలో పడ్డారు. అన్నం, బంగాళ దుంపలు లాంటివి పండించాలంటే చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. ఎంత శ్రమించినా ప్రకృతి సాయం చేయకపోతే వీటిని పొందడం చాలా కష్టం అవుతుంది.
అలాంటి సమయంలో ఏది కూడా చవక అవ్వదు. అప్పుడు సామంత రాజుల్లో ఒక రాజుకి మాంసాహారం గురించి ఆలోచన వచ్చింది. ఎలాగైనా రాజుకు ఈ విషయం చెప్పాలనుకున్నాడు. అప్పుడు అతను రాజుతో అన్నిటి కంటే చవకైన ఆహారం మాంసాహారం అవుతుంది. మాంసాహారం అనేది పౌష్ఠికాహారం అవుతుంది అన్నాడు. అది విన్న మిగతా సామంత రాజులు అంతా సమర్ధించారు. కానీ మగద రాజ్యం మహామంత్రి మాత్రం సైలెంట్‌గా ఉన్నాడు.
అప్పుడు మహారాజు మహామంత్రి.. మీరెందుకు ఏమీ మాట్లాడటం లేదు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు. అప్పుడు మహామంత్రి.. మహారాజా.. ఈ విషయాలన్నీ నేను అంగీకరించలేను. మాంసాహారం అన్నిటి కంటే చవక పదార్థం అనేది నేను నమ్మను. అయినా కానీ ఈ విషయంపై నేను రేపు సభలో మాట్లాడతాను అన్నాడు. ఆరోజు రాత్రి మహా మంత్రి సభలో ఉన్న ఉద్దేశంతో చెప్పిన సామంత రాజు ఇంటికి వెళ్లారు. అంత రాత్రి సమయంలో మహామంత్రి తన ఇంటికి రావడం చూసి సామంతుడు భయపడ్డాడు.
అతనితో మహామంత్రి ఇలా అన్నాడు.. సాయంత్రం సమయంలో మహారాజు జబ్బు పడ్డారు. మహారాజు పరిస్థితి దారుణంగా ఉంది. ఎవరైనా బలశాలి అయిన రాజు శరీరం మాంసం నాకిస్తే మహారాజు జబ్బు నయం అవుతుంది అని రాజ వైద్యుడు చెప్పాడు. మీ అంత యోగ్యం కలిగిన రాజు ఇంకెవ్వరూ లేరు. ఈ విషయంలో మీరు సాయం చేస్తే లక్ష సవర్లు ఇవ్వగలను. అందుకు బదులుగా నేను మీ గుండెను చీల్చి కొంచెం మాంసం తీసుకుంటాను అని మహామంత్రి చెప్పాడు. అది విని సామంతుడి ముఖం రంగు మారిపోయింది.
అసలు జీవించి ఉండకపోతే ఆ లక్ష సవర్లతో నేనేం చేసుకుంటాను అని ఆలోచించాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి తన పెట్టెలో ఉన్న లక్ష స్వర్ణ ముద్రలు తెచ్చి మహామంత్రి కాళ్లు పట్టుకున్నాడు. మహామంత్రి.. మీ వద్ద ఉన్న లక్ష సర్వముద్రలతో పాటు వీటిని కూడా తీసుకుని వేరే సామంతుడి మాంసాన్ని కోరండి. నన్ను మాత్రం వదిలేయండి అన్నాడు. అప్పుడు మహామంత్రికి అంతా అర్థమైపోయింది. అతను సామంతుడికి భయాన్ని బాధను కలగజేయాలనుకున్నాడు. అందుకే మహామంత్రి ఇలా అన్నాడు. ఓ సామంత రాజా.. మీరు చాలా బలంగా పుష్ఠిగా ఉన్నారు. మీ శరీరం మహారాజు శరీరానికి దగ్గరగా ఉంది. అందుకే రాజ వైద్యుడు ప్రత్యేకంగా మిమ్మల్ని ఎన్నుకున్నాడు.
మీరు ఇచ్చే దానం వల్ల మన మహారాజు చావు నుంచి బయటపడతాడు. కావాలంటే నా మహామంత్రి పదవి మీకు ఇస్తాను. మీ కర్మచారిగా బాధ్యతలు తీసుకుంటాను అని మహామంత్రి చెప్పాడు. అది విన్న సామంతుడు సందిగ్ధంలో పడ్డాడు. అతను శరీరంపై అంగవస్త్రం వేసుకుని చెప్పులు వేసుకుని ఉన్నాడు. వెంటనే మహామంత్రి కాళ్లపై పడ్డాడు. మహామంత్రీ.. అందుకు నేను యోగ్యుడిని కాను. అసలు ప్రాణాలే లేకపోతే ఏ పదవి ఇచ్చినా నేనేం చేసుకుంటాను. మీకు కావాలంటే నా సర్వస్వం తీసుకోండి. కానీ నా ప్రాణం మాత్రం తీయకండి. నా భవనాన్ని నా దగ్గర ఉన్న సంపద మొత్తాన్ని మీకు ఇచ్చేస్తాను. రాత్రికి రాత్రే రాజ్యాన్ని వదిలి వెళ్లిపోతాను అని చెప్పి తన గుర్రం వద్దకు పరిగెత్తాడు.
దాంతో మహామంత్రి ఏమీ అనలేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాంతో సామంతుడు ఊపిరి పీల్చుకున్నాడు. సామంతుడి నిద్ర ఎగిరిపోయింది. స్వర్ణ ముద్రలను తీసుకుని మహామంత్రి మిగతా సామంతుల వద్దకు వెళ్లి మహారాజు కోసం మాంసం అడిగితే ఎవ్వరూ ఇవ్వడానికి ఒప్పుకోరు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అందరూ తిరిగి స్వర్ణ ముద్రలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ విధంగా మహామంత్రి కేవలం ఒక రాత్రిలో కొన్ని కోట్ల స్వర్ణముద్రలను పోగుచేసాడు. ఆ రోజు సభకు సామంతులు అంతా త్వరగా హాజరయ్యారు. అందరూ మహారాజు ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని అనుకున్నారు. కానీ ఎవ్వరూ కూడా మిగతా వారిలో ఏమీ మాట్లాడలేదు. అందరూ రాజ వైద్యుడి కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే రాజ వైద్యుడి నుంచే మహారాజు ఆరోగ్యం గురించి తెలిసే అవకాశం ఉంది. మహారాజు ఎప్పటివరకు సభకు రారో అప్పటివరకు ఏ ఒక్క సామంతుడిని కూడా సభ నుంచి బయటికి వెళ్లడానికి అనుమతి ఇవ్వకూడదని మహామంత్రి సైనికులకు ఆదేశించాడు. ఆ తర్వాత మహారాజు సభలోకి వచ్చారు.
మహారాజుకి ఎలాంటి అనారోగ్యం ఉన్నట్లు సామంతులకు అనిపించలేదు. మహామంత్రి తమతో అబద్ధం చెప్పాడని ప్రతి సామంతుడు మనసులో అనుకున్నాడు. కానీ ఈ విషయం గురించి ఎవ్వరితోనూ మాట్లాడలేదు. అప్పుడు మహామంత్రి వచ్చి మహారాజు ఎదురుగా కొన్ని కోట్ల స్వర్ణ ముద్రలను పెట్టాడు. అప్పుడు మహారాజు ఇన్ని ఎవరి కోసం అని అడగ్గా.. కేవలం కొంచెం మాంసం కోసం ఇంత ఎక్కువ ధనం లభించింది. కానీ మాంసం లభించలేదు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి సామంతులు ఇన్ని స్వర్ణ ముద్రలు ఇచ్చారు. మాంసం ఎంత చవకైందని ఇప్పుడు మీరే వివరించండి అని మహామంత్రి అన్నాడు. అప్పుడు మహారాజుకి అసలు విషయం అర్థమైంది. వెంటనే ప్రజలకు కష్టపడి వ్యవసాయం చేయమని ఆదేశించాడు. రాజ భాండాగారం నుంచి కొంత ధాన్యాన్ని శ్రామికులకు ఇచ్చాడు. శ్రామికులు పౌష్ఠిక ఆహారాన్ని పండించడం మొదలుపెట్టాడు. దాంతో పంటలు బాగా పండి రాజ్యంలో ఉన్న కరువు మొత్తం పోయింది. జీవితం విలువను కృష్ణుడు మనకు ఈ కథ ద్వారా చెప్పాలనుకున్నాడని భగవద్గీతలో రాసుంది.