Janasena: వర్మకు అంత సీన్ లేదు.. పిఠాపురంలో జనసేన ర్యాగింగ్?
Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ ఇక్కడ పోటీ చేయకపోయి ఉంటే తెలుగు దేశం పార్టీ తరఫున ఎస్వీఎస్ వర్మ బరిలోకి దిగేవారు. పవన్ పోటీ చేస్తున్నారని తెలిసి వర్మ రచ్చ చేసారు. తాను తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి మరీ ఒంటరిగా నిలబడతానని హెచ్చరించారు. ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వర్మను పిలిపించి నచ్చజెప్పారు. దాంతో వర్మ శాంతించారు.
అయితే ఇప్పుడు పిఠాపురంలో జనసేన కార్యకర్తలు వర్మను అతని అనుచరులను ర్యాగింగ్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. వర్మను కాదని తమ నాయకుడు టికెట్ దక్కించుకోవడం తెలుగు దేశం పార్టీపై జనసేన విజయంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వర్మకు అంత సీన్ లేదని, ఇక పవన్ కళ్యాణే శాశ్వతంగా పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఉంటారంటూ తెలుగు దేశం పార్టీ శ్రేణుల్ని జనసేన ర్యాగింగ్ చేస్తోందని టాక్.