Kavitha: డబుల్ అరెస్ట్.. ఆల్రెడీ జైల్లో ఉన్న కవిత.. మళ్లీ అరెస్ట్ ఎందుకు?
Kavitha: భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam) ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కవితను అరెస్ట్ చేయగా.. ఢిల్లీలోని కోర్టు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించింది. దాంతో కవితను తిహార్ జైలులో ఉంచారు. ఇటీవల ఆమె పెట్టుకున్న మధ్యంతర బెయిల్ కూడా రద్దయ్యింది. ఈ నేపథ్యంలో ఈరోజు కవితను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులు మరోసారి అరెస్ట్ చేసారు.
డబుల్ అరెస్ట్ చేయచ్చా?
ఆల్రెడీ కవిత అరెస్ట్ అయ్యారు కాబట్టే జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న వ్యక్తిని మళ్లీ అరెస్ట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? ఎందుకంటే.. ముందు అరెస్ట్ చేసిన సంస్థ వేరు.. ఈరోజు అరెస్ట్ చేసిన సంస్థ వేరు. ఢిల్లీలో ED, CBI సంస్థలు వేర్వేరుగా పనిచేస్తుంటాయి. ముందు నుంచి ఢిల్లీ లిక్కర్ స్కాంను సీబీఐ దర్యాప్తు చేస్తూనే ఉంది. కానీ కవిత CBI విచారణకు హాజరుకావడంలేదని ఈడీ రంగంలోకి దిగింది. దాంతో తమకు రావాల్సిన సమాచారం కవిత నుంచి ఇంకా రాలేదని కోర్టులో పిటిషన్ వేసిన సీబీఐకి అనుకూలంగా తీర్పు రావడంతో కవితను CBI తమ ఆధీనంలోకి తీసుకుంది. దాంతో కవితను ఇప్పుడు తీహార్ జైల్లోనే ఉంచి సీబీఐ అధికారులు లిక్కర్ స్కాం గురించి విచారణ చేపడతారు. రేపు మళ్లీ కవితను కోర్టులో ప్రవేశపెడతారు.