Viral News: సూర్య గ్ర‌హ‌ణ ప్ర‌భావం.. భ‌ర్త‌, పిల్ల‌ల్ని చంపేసింది

Viral News: ఇటీవ‌ల సంభ‌వించిన సూర్య గ్ర‌హ‌ణ ప్రభావంతో అమెరికాకు చెందిన జ్యోతిష్యురాలు త‌న భ‌ర్త‌, పిల్ల‌ల్ని దారుణంగా హ‌త్య చేసింది. అమెరికాకు చెందిన‌ డ్యానియ‌ల్ జాన్స‌న్‌.. ఆన్‌లైన్‌లో జాత‌కాలు చెప్తుంటుంది. మొన్న సూర్య గ్ర‌హ‌ణం వ‌స్తున్న నేప‌థ్యంలో అంద‌రూ త‌మ మ‌న‌సును నిర్మ‌లంగా ఉంచుకోవాల‌ని ట్విట‌ర్‌లో పేర్కొంది. సూర్య గ్ర‌హణం రోజున త‌న భ‌ర్తను క‌త్తితో దారుణంగా చంపేసి ఆ త‌ర్వాత కారులో త‌న ఇద్ద‌రు పిల్ల‌ల్ని ఎక్కించుకుని వారిని కారు నుంచి విసిరేసి చివ‌రికి చెట్టును ఢీకొంది.

ఈ ఘ‌ట‌న‌లో డ్యానియ‌ల్ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందగా.. ఇద్ద‌రు పిల్ల‌ల్లో ఒక బాలిక ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది. అమెరిక‌న్ పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకోగా డ్యానియ‌ల్ శ‌రీరం గుర్తుప‌ట్ట‌ని విధంగా ఛిద్రం అవ్వ‌డంతో పోస్ట్ మార్టెంకు త‌ర‌లించారు. ఇలాంటి గ్ర‌హ‌ణాల విష‌యంలో ఎవ్వ‌రూ కూడా ఆన్‌లైన్‌లో ఏది ప‌డితే అది చూసి నమ్మ‌కండి అని శాస్త్రవేత్త‌లు చెప్తున్నా కూడా ఈ కాలంలోనూ ఇంకా కొన్ని ఆచారాల‌ను పాటించేవారు ఎక్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం.