పవన్‌ను ఏమీ అనొద్దు.. గుడివాడకు జగన్ వార్నింగ్?
Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ చేయొద్దని గుడివాడ అమర్నాథ్‌కు జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల పవన్ గుడివాడ అమర్నాథ్ సీటు అనకాపల్లిలో వారాహి యాత్రను చేపట్టారు. ఆ సమయంలో గుడివాడ అమర్నాథ్ పేరు తీయకుండా కోడిగుడ్డు మంత్రి అంటూ తెగ సెటైర్లు వేసారు. ఒకప్పుడు అనకాపల్లి అంటే బెల్లం గుర్తుకు వచ్చేదని ఇప్పుడు కోడిగుడ్డు మాత్రమే గుర్తొస్తోందని ఎగతాళి చేసారు. కోడిగుడ్డు మంత్రి పెట్టిన గుడ్డు ఇంకా పొదుగుతూనే ఉందని విమర్శలు గుప్పించారు.
అయితే తనపై చిన్న కామెంట్ చేసినా వెంటనే ప్రెస్‌మీట్లు పెట్టి మరీ రియాక్షన్ ఇచ్చే గుడివాడ అమర్నాథ్.. మొన్న పవన్ కళ్యాణ్ అంతగా విమర్శించినప్పటికీ ఇంకా నోరువిప్పలేదు. ఇందుకు కారణం ఇప్పుడు పవన్‌పై కామెంట్స్ చేస్తే సీటు పోతుందన్న భయమే అని తెలుస్తోంది. ఇప్పుడు పవన్‌ను ఏమీ అనొద్దు అని తాడేపల్లిగూడెం నుంచి అమర్నాథ్‌కు కబురు అందినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.