బంగారం క‌న్నా విలువైన బ్యాగులు.. పెట్టుబ‌డి పెట్ట‌చ్చా?

Gold:  హ‌ర్మె బెర్కిన్.. ఇది అతిపెద్ద అంత‌ర్జాతీయ బ్రాండ్. చాలా ఖ‌రీదైన‌ది. ఎంత ఖ‌రీదైన‌దంటే.. మ‌నం బంగారంలో పెట్టే పెట్టుబ‌డిని.. ఈ సంస్థ త‌యారు చేసే బెర్కిన్ బ్యాగుల్లో పెడితే మంచిది అని నిపుణులే చెప్తున్నారు. ఈ బ్యాగుల‌కు మార్కెట్‌లో ఎంత డిమాండ్ ఉందంటే.. సెకండ్ హ్యాండ్ బ్యాగుల‌ను కూడా కొన్ని వేలు, ల‌క్ష‌లు పెట్టి కొనేస్తున్నారు. గత ప‌దేళ్ల‌లో ఈ బెర్కిన్ బ్యాగుల రీసేల్ ఎంత‌గా పెరిగిపోయిందంటే.. వీటి విలువ బంగారాన్ని దాటేసింది.

ప‌దేళ్ల క్రితం కొని పెట్టుకున్న బెర్కిన్ బ్యాగుల‌ను ఇప్పుడు అమ్మితే డ‌బుల్ రేటుకు అమ్ముడుపోతున్నాయ‌ట‌. దాంతో బంగారంలో పెట్టుబ‌డులు పెట్టే బ‌దులు మా బ్యాగుల‌పై పెట్టండి అని బెర్కిన్ సంస్థ అధినేత జేమ్స్ ఫైర్‌స్టైన్ అంటున్నారు. ఒక్కో బెర్కిన్ బ్యాగు ధ‌ర 9 వేల డాల‌ర్ల నుంచి 30 వేల డాల‌ర్ల వ‌ర‌కు ప‌లుకుతుంది. ఈ కంపెనీ ఓ వింత రూల్‌ని కూడా పెట్టింది. ఏడాదిలో ఒక క‌స్ట‌మ‌ర్ ఒక బెర్కిన్ బ్యాగును మాత్ర‌మే కొనుగోలు చేయాల‌ట‌. అది కూడా కేవ‌లం డబ్బున్న వారు మాత్ర‌మే త‌మ స్టోర్‌కి రావాల‌ని రూల్ పెట్టింది.