JR NTR: వార్ 2.. స‌ర్‌ప్రైజింగ్ అప్డేట్..!

JR NTR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వార్ 2 (War 2) సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌కత్వంలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్‌తో (Hrithik roshan) తార‌క్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అయితే ఈ సినిమాలో తార‌క్ రోల్‌కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ వైర‌ల్ అవుతోంది. ఇందులో ఎన్టీఆర్ డ‌బుల్ రోల్‌లో కనిపించ‌బోతున్నార‌ట‌.

ఒకటి పాజిటివ్, మ‌రొక‌టి నెగిటివ్ పాత్ర‌గా డ‌బుల్ రోల్‌లో క‌నిపిస్తార‌ని టాక్ న‌డుస్తోంది. సినిమాలో ఎన్టీఆర్ డ‌బుల్ రోల్‌ని ఇంట‌ర్వెల్ సీన్‌లో ట్విస్ట్‌గా చూపించ‌బోతున్నార‌ని.. ఫ్యాన్స్ స‌ర్‌ప్రైజ్ అవుతార‌ని అంటున్నారు. మొత్తం సినిమా క‌థ‌లోనే ఇది ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంద‌ట‌. ప్యాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న మ‌ల్టీస్టార‌ర్ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాతో తార‌క్ త‌డాఖా ఏంటో బాలీవుడ్ వారికి కూడా అర్థ‌మ‌వుతుంది.